ఖతర్ లో అందర్ని ఆకట్టుకోన్న పెమ్మసాని చంద్రశేఖర్
పల్లెలను ప్రేమించాలని ప్రవాసాంధ్రులను కోరిన మంత్రి
గల్ఫ్ జ్యోతి విలేఖరి

విదేశాలలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు కేవలం డిజిటల్ సంబంధమె కాకుండ మాతృభూమితో భౌతిక బంధాన్ని కూడ పటిష్ఠం చేసుకోవాలని, స్వదేశానికి వెళ్ళినప్పుడల్లా తమ పల్లెలలో గడపాలని కేంద్ర టెలికం సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హితువు పలికారు. తాను సుదీర్ఘ కాలం అమెరికాలో ఉన్నా మాతృభూమిలోని మూలాలను ఎప్పటికి మరువలేదని అందుకె రాజకీయాలలో వచ్చి ప్రజా సేవ చేస్తున్నానని ఆయన అన్నారు. విదేశాలలో కష్టపడి సంపాదించి వచ్చిన వారు డబ్బు రాజకీయాలతో నష్టపోవద్దని కూడ ఆయన సూచించారు. కనీసం ఒక పాతిక ఏళ్ళు విదేశాలలో డబ్బు సంపాందించిన అనంతరం ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించాలని ఆయన చెప్పారు. ఎక్కడ ఉన్నా తమ తమ ఊళ్ళతో సంబంధాలు కల్గి ఉండాలని, నిజాయితీ, నిబద్ధతతో ప్రజా సంబంధాలు పెంచుకోవాలని చెబుతూ స్ధానిక సంస్ధల ఎన్నికలలో కూడ తెలుగుదేశం పార్టీ ఈ బంధం ద్వార ఓటర్ల ఆదరణ పొందినట్లుగా చంద్రశేఖర్ పెర్కోన్నారు.
ఒక అంతర్జాతీయ టెలికం సదస్సులో పాల్గోనడానికి ఖతర్ కు వచ్చిన ఆయన నిమిషం తీరిక లేకుండా నిమగ్నమై ఉండి కూడ తెలుగు ప్రవాసీయులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఓపికగ్గా సమావేశమవుతూ వారికి హితబోధనలు చేయడం ద్వార అందర్ని ఆకట్టుకోన్నారు.
స్వతహాగా ప్రవాసీ అయిన ఆయన, అయిదు వేల కోట్ల రూపాయాలతో ప్రస్తుత లోక్ సభ సభ్యులందరికెల్లా సంపన్నుడు, యువకుడు, పార్టీ నాయకత్వానికి విధేయుడు, ప్రభుత్వంలో సమర్ధుడిగా గుర్తింపు పేరొందిన పెమ్మసాని వ్యక్తిత్వం ప్రవాసీయులందర్ని ఆకర్షించింది.
మంత్రి గౌరవార్ధం బుధవారం రాత్రి రాయబారి డాక్టర్ కె.శ్రీకర్ రెడ్డి తన నివాసంలో విందు ఏర్పాటు చేయగా అందులో భారతీయ ప్రముఖులను ఆహ్వనించగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని వీలయినంత ఎక్కువ మందిను పిలిచారు.
ఈ సందర్భంగా తనను కలిసిన తెలుగు ప్రవాసీయులతో మాట్లాడుతూ 15 బిలియన్ డాలర్ల భారత్ నెట్ ప్రాజెక్టుల గూర్చి వివరిస్తూ డిజిటిల్ విప్లవ ఫలితాలను వివరించారు.
తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా టెలికం టవర్లు నిర్మించినా వాటి నిర్వహణను గాలికు వదలడంతో అవి సక్రమంగా పని చేయకపోవడంతో సెల్ ఫోన్ల సిగ్నళ్ళ సమస్య ఏర్పడిందని అంటూ తాను మంత్రిగా పదవి భాద్యతలు స్వీకరించిన అనంతరం టవర్ల పని తీరును రెట్టింపు చేయడంతో ఆ సంఖ్య 20 వేల నుండి 50 వేలకు పెరిగిందని, దీన్ని మరో రెండు సంవత్సరాలలో 2 లక్షల 70 వేలకు పెంచడం ద్వార కనెక్టివిటిను అభివృద్ధి చేయాలనె లక్ష్యంతో ఉన్నట్లుగా పెమ్మసాని వెల్లడించారు.
రాష్ట్రాభివృద్ధి కొరకు టెక్నాలిజిను విరివిగా అందుబాటులోకి తీసుకోరావడం ద్వార పెట్టుబడులను ఆకర్షించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు యువ నాయకులు లోకేశ్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రవాసాంధ్రులకు వివరించారు.
బుధవారం వివిధ సందర్భాలలో ప్రవాసాంధ్రులను కలుసుకోన్న ఆయన సాయంత్రం రాయబారి ఇంట్లో అందరితో కలిసి మాట్లాడారు. గురువారం సాయంత్రం కూడ ఖతర్ లోని తెలుగుదేశం పార్టీ వర్గాలతో కూడ ఆయన వేర్వేరుగా సమావేశమయ్యారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు లోక్ సభ నియోజకవర్గానికి చెందిన ప్రతి ఒక్కర్ని కలుసుకోవడానికి పెమ్మసాని ఆసక్తి చూపారు. తన మోబైల్ పై ఫోన్ చేసిన ప్రతి ఒక్కరితో పలుకరించి హోటల్ కు పిలిపించారు.
అంతకు ముందు, అంతర్జాతీయ సదస్సులో సైబర్ నేరాలకు సరిహద్దులు లేవని అన్ని దేశాలు కలిసి దాన్ని ఎదుర్కోవాలని, అందరు పాఠాలు నెర్చుకోవాలని మంత్రి అన్నారు. ఆర్ధిక లావదేవీలలో భారత్ సాధించిన పురోగతిను వివరించారు.
తెలుగు రాయబారి వచ్చిన అనంతరం ఇది తొలి విందు సమావేశం కావడం మరియు కేంద్ర మంత్రి కూడ ఒకప్పుడు స్వయాన తెలుగు ప్రవాసీ కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకోంది. విందుకు హజరయిన తెలుగు వారందరు కూడ మంత్రి మరియు రాయబారితో తెలుగులో మాట్లాడడంతో అతికొద్ది మంది ఇతర రాష్ట్రాల ప్రముఖులు ఒకింత అసహానానికి గురయ్యారు.



.png)



